: సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన స్మిత సబర్వాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ కలిశారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలన వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్మిత ఉత్తమ కలెక్టర్ గా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. తాజాగా మెదక్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 'ఓటేయండి, కారు గెలుచుకోండి' అంటూ ప్రచారం చేపట్టి విజయం సాధించారు. కాగా స్మిత భర్త అకున్ సబర్వాల్ హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.