: బాబు ప్రమాణ స్వీకారానికి హాజరుపై నేడు నిర్ణయం తీసుకోనున్న మోడీ
ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోడీ సహా గవర్నర్లు, కేంద్రమంత్రులు, జాతీయ పార్టీ నేతలకు చంద్రబాబు నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో, బాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయంపై ఈ సాయంత్రం ప్రధాని మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం రేపు, ఎల్లుండి విజయవాడలోనే గడపనున్నారు.