: సమర్థవంతంగా నడపండి... మీ వెంట మేమున్నాం: అశోక్ గజపతిరాజు
లోక్ సభను సమర్థవంతంగా నడపాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ మహిళా స్పీకర్ గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. సభలో ఎక్కువ మంది కొత్త సభ్యులున్న ప్రస్తుత తరుణంలో సభను చక్కగా నడిపించాలని ఆయన కోరారు. స్పీకర్ కు మద్దతు తెలిపేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు. సభ మర్యాదను కాపాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా లోక్ సభ కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.