: ఢిల్లీలోనూ ఎండలు మండుతున్నాయ్
మన రాష్ట్రంలోనే కాదు... దేశ రాజధానిలోనూ ఎండలు మండిపోతున్నాయ్. భానుడు తన ప్రతాపం చూపడంతో, ఉక్కపోతతో ఢిల్లీ నగర ప్రజలు అల్లాడుతున్నారు. గురువారం నాడు ఢిల్లీలో ఈ సీజన్ లోనే అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు నగరవాసులు రోడ్ల పైకి వచ్చేందుకు వెనుకాడుతున్నారు. పగలు 12 నుంచి 3 గంటల మధ్యనైతే ఢిల్లీ రోడ్లు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. తప్పనిసరై బయటకు వచ్చే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వారు వెల్లడించారు.