: యువరాజ్ సింగ్ కి మరో షాక్!


భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మరో షాక్ తగిలింది. ప్రపంచకప్ ను ఒంటి చేత్తో భారత్ కు అందించి, అత్యుత్తమ ఫాంలో ఉండగా క్యాన్సర్ సోకిందని తెలుసుకున్న యువరాజ్ సింగ్ ఇప్పుడు షాక్ కు గురయ్యాడు. తాజాగా ఆయన తండ్రి, భారత మాజీ టెస్టు క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ కు కూడా క్యాన్సర్ సోకింది. ఆయనకు గొంతు క్యాన్సర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన అమెరికాలో చికిత్స పొందుతున్నారు.

యువరాజ్ చికిత్స పొందిన ఆసుపత్రిలో కాకుండా, వేరే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయన గొంతు నుంచి ఒక కణితిని తీసేసి, కొన్నాళ్ళ పాటు మాట్లాడకుండా ఉండాలని సూచించారు. యోగ్ రాజ్ సింగ్ మొదటి భార్య షబ్నమ్ ద్వారా యువరాజ్ సింగ్ జన్మించాడు. ఆ తరువాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈయన రెండో భార్య పేరు సత్వీర్ కౌర్.

  • Loading...

More Telugu News