: మోడీ తల్లికి పాక్ పిఎం కానుక


ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ చీరను ప్రత్యేక కానుకగా పంపారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ లో తెలిపారు. 'నా తల్లి కోసం నవాజ్ షరీఫ్ అందమైన తెల్ల చీరను కానుకగా పంపారు. ఇందుకు నేను ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాను. త్వరలో దానిని మా అమ్మకు పంపుతాను' అని చెప్పారు. గత నెలలో మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన షరీఫ్ తిరిగి వెళ్లేటప్పుడు ఆయన తల్లికి మోడీ ప్రత్యేకంగా శాలువను పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరుగు కానుకను షరీఫ్ పంపారు.

  • Loading...

More Telugu News