: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9 నుంచి 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 10న అందరూ కలసి స్పీకర్ ను ఎన్నుకుంటారు. 11న సభలో గవర్నర్ ప్రసంగిస్తారు. 12న బీఏసీ సమావేశం జరుగుతుంది. 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది.