: ప్రభుత్వ ఏర్పాటుకు బాబును ఆహ్వానించాలని గవర్నర్ ను కోరాం: యనమల


ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను యనమల రామకృష్ణుడు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్ష బృందం కలసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్లు అనంతరం మీడియాకు తెలిపారు. బాబును పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఈ నెల 8న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ కు చెప్పామన్నారు. ప్రమాణ స్వీకార వివరాలను అధికారికంగా పంపాలని గవర్నర్ కోరారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News