: డంబెల్స్ చేతపట్టిన ఒబామా
బరువులెత్తగలవా... ఓ నరహరి డంబెల్స్ లేపగలవా? అంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా జిమ్ లో కుస్తీలు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఒబామా యూరోప్ దేశాల పర్యటనలో భాగంగా తొలుత పోలండ్ కు వెళ్లారు. మంగళవారం రాత్రి అక్కడి మారియెట్ హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయమే నిద్ర లేచిన తర్వాత హోటల్లోని జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేశారు. నల్లటి జిమ్ సూట్ లో ఆయన చేస్తున్న కసరత్తులను హోటల్లో ఓ అతిథి షూట్ చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టగా, అదిప్పుడు సంచలనం సృష్టిస్తోంది.