: ఆమ్ ఆద్మీ నుంచి మరొకరు అవుట్
లోక్ సభ ఎన్నికల్లో చతికిలపడిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పటికే షాజియా ఇల్మి, గోపీనాథ్ సహా ఎంతో మంది పార్టీని వీడగా... తాజాగా అంజలి దమానియా కూడా గుడ్ బై చెప్పేశారు. అంజలి మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీకి పెద్దదిక్కుగా ఉన్నారు. 'సహచరులారా! భారమైన హృదయంతో ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధానికి ముగింపు పలుకుతున్నా' అంటూ ఆమె పార్టీ ఆఫీసు సిబ్బందికి సమాచారం పంపారు. పార్టీ నుంచి వెళ్లడంపై ఎలాంటి కుట్రపూరిత కథనాలను సృష్టించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.