: ఆ కుబేరుల విదేశీ సంపదపై దర్యాప్తు: చిదంబరం


పన్ను ఎగవేసి విదేశీ గడ్డపై సొమ్ములు పోగేసిన ప్రముఖులపై విచారణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. పరిశోధక జర్నలిస్టుల అంతర్జాతీయ కూటమి(ఐసిఐజె) ప్రపంచవ్యాప్తంగా పన్నుల్లేని దేశాలలో సంపద పోగేసిన వారి జాబితాను వెలవరించిన సంగతి తెలిసిందే. ఇందులో 612 మంది భారతీయులు కూడా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పెద్దపల్లి ఎంపీ వివేక్, సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు, మరొకరు కూడా చోటు సంపాదించారు

. ఐసిఐజె వెల్లడించిన జాబితాను సేకరించామని, దానిపై విచారణ జరిపిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. ఐసిఐజె 612 మంది భారతీయులకు విదేశాలలో ఖాతాలున్నాయని.. వీరంతా అక్కడ పన్నులు చెల్లించని సంపద దాచుకున్నట్లు వెలుగులోకి తెచ్చింది. వీరిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యూబీ గ్రూప్ అధిపతి విజయ్ మాల్యా, పారిశ్రామిక వేత్తలు, రవి రూయా, సమీర్ మోడీ, చేతన్ బర్మన్, అభయ్ కుమార్ ఓస్వాల్, సురభ్ మిట్టల్, లాల్ చంద్ మీర్ చందాని తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News