: హైదరాబాదులో ఆంధ్రులకు సమస్యలు వస్తే స్పందిస్తాం: డీజీపీ రాముడు
హైదరాబాదులో ఆంధ్రులకు సమస్యలు వస్తే స్పందిస్తామని డీజీపీ జాస్తి వెంకటరాముడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేస్తే సమస్యలు దరి చేరవన్న ఆయన, అభివృద్ధి సాధించాలంటే రెండు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని స్పష్టం చేశారు.