: మూత్రం పోశాడని...మర్మాంగం కోసేశాడు!


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మరో దుర్మార్గం వెలుగు చూసింది. పొలంలో మూత్రం పోశాడని, అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి మర్మాంగాన్ని కోసేశాడో కామందు. ప్రతాప్ గఢ్ జిల్లా కొరాలి గ్రామంలో ఇటుక బట్టీ కార్మికుడు శేష్ రామ్ కుమారుడు రితేష్ మూత్ర విసర్జనకు పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. దానిని చూసిన పొలం యజమాని రితేష్ ను విచక్షణారహితంగా కొట్టి, మర్మాంగం కోసేశాడు.

రక్తస్రావం అవుతున్నా బాలుడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం వివరించాడు. దీంతో రితేష్ ను చికిత్స నిమిత్తం అలహాబాద్ కు తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పొలం యజమాని దుర్గేష్ మౌర్య, అతని కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News