: సుబ్రతోరాయ్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతోరాయ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తనను గృహ నిర్భంధంలో ఉంచాలంటూ సుబ్రతోరాయ్ న్యాయస్థానానికి విన్నవించగా.... అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను ఇంతకు ముందు కోర్టు కొట్టివేసిన విషయం విదితమే. కాగా, మదుపరులకు చెల్లించాల్సిన డబ్బు సేకరణకు దేశంలోని 9 నగరాల్లో ఉన్న సహారా సంస్థకు చెందిన స్థిరాస్తులను విక్రయించేందుకు ‘సుప్రీం’ అనుమతి ఇచ్చింది.