: లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్?


16వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎంపీ సుమిత్రా మహాజన్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానం నుంచి సుమిత్ర ఎనిమిదో సారి గెలిచారు. ఆమె పేరును స్పీకర్ పదవికి ఖరారు చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదే అధికారిక నిర్ణయమైతే, మీరాకుమార్ తర్వాత స్పీకర్ పదవిని అలంకరించిన రెండో మహిళగా సుమిత్ర నిలిచిపోతారు. స్పీకర్ ఎన్నిక శుక్రవారం జరగనుంది. స్పీకర్ ఎన్నిక ముగిసే వరకూ సభాపతి బాధ్యతలను ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. ప్రొటెం స్పీకర్ గా కమల్ నాథ్ ఈ రోజు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News