: ఆ సినిమా కోసం 40 సార్లు గుండు గీశారు


భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజంపై తమిళ, ఇంగ్లీషు భాషల్లో నిర్మిస్తున్న సినిమా కోసం తన తలకు కనీసం 40 సార్లు గుండు గీశారని నటుడు అభినయ్ వడ్డి తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, చిత్రంలో ముఖ్యపాత్ర గుండుతో కనిపించాలని దర్శకుడు ముందే చెప్పినందువల్ల తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని అన్నారు.

తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్ జరుగుతున్నంతసేపు క్షురకుడు తనతో బాటే ఉన్నాడని ఆయన గుర్తు చేసుకున్నారు. లండన్ లో విగ్ పెట్టుకుని తిరిగేద్దామని తెగ ఆరాటపడ్డా, చిన్న చిన్న వెంట్రుకలు రావడంతో విగ్ తలకు అతుక్కునేది కాదని, అందుకని మళ్లీ గుండు గీయించుకోవాల్సి వచ్చిందని అభినయ్ చెప్పారు.

  • Loading...

More Telugu News