: గంగిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ


అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరిలో దాడి కేసులో ప్రధాన పాత్రదారుడైన గంగిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కొన్ని రోజుల కిందట నకిలీ పాస్ పోర్టుతో విదేశాలకు పారిపోయిన అతడిని స్వదేశానికి రప్పించేందుకు తాజాగా కర్నూలు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ఇమిగ్రేషన్ కేంద్రాలకు ఆ నోటీసును పంపారు. అటు కడప పోలీసులు కూడా గంగిరెడ్డిపై నోటీసు జారీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే కడప జిల్లాలో మూడు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులలో గంగిరెడ్డిని నిందితుడిగా చేర్చారు.

  • Loading...

More Telugu News