: ఎనిమిది మందికి ఉరిపై సుప్రీం స్టే
రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కారంతో ఉరికంభం ఎక్కాల్సిన ఎనిమిది మందికి సుప్రీం కోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వీరికి ఉరిశిక్ష అమలుపై నాలుగు వారాల పాటు స్టే విధిస్తూ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ ఇక్బాల్ తో కూడిన బెంచ్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.
ఉపశమనం లభించిన దోషులలో సోనియా, ఆమె భర్త సంజీవ్, గుర్మీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, సుందర్ సింగ్, జాఫర్ అలీ, సురేష్, రామ్ జీ ఉన్నారు. వీరి తరఫున పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ అనే పౌర హక్కుల ఉద్యమ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరికి ఉరిశిక్ష పడి చాలా ఏళ్లయిపోయిందని కనుక నిలిపివేయాలని కోరింది. స్మగ్లర్ వీరప్పన్ అనుచరుల ఉరి అమలు ఆలస్యం అయినందున వారి కేసులో సుప్రీం స్టే విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనల అనంతరం సుప్రీం ధర్మాసనం ఎనిమిది మందికి ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది.