: బస్సులో వెళ్తుండగా... రూ. 32 లక్షలు దోచేశారు!
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దొంగలు రూ. 32 లక్షలు దోచేశారు. ఓ ధాన్యం వ్యాపారి నగదును తీసుకువెళ్తుండగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద దొంగతనం జరిగింది. దాంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కు పరుగెత్తాడు. పెదకాకాని పోలీస్ స్టేషన్ లో తన డబ్బు చోరీ అయిందంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.