: 16వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం
పదహారవ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా ఉన్న కమల్ నాథ్ సభను నిర్వహిస్తున్నారు. ముందుగా బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అయిన గోపీనాథ్ ముండే మృతికి సభలోని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అంతకుముందు లోక్ సభలోని కొత్త సభ్యుల జాబితాను సెక్రెటరీ జనరల్ స్పీకర్ కు అందజేశారు.