: భద్రాద్రి ఆలయంలో అర్చకులు, ఉద్యోగుల ధర్నా
ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునాథ్ తమను వేధిస్తున్నాడంటూ అర్చకులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగుల ధర్నా కారణంగా భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.