: బాలల చట్టాలు పటిష్ఠం చేయాలి: సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
దేశంలో బాలల చట్టాలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ అన్నారు. బాలల చట్టాల పట్ల చాలా మందికి అవగాహన లేదన్నారు. దేశంలో చాలా న్యాయస్థానాలలో సరైన వసతులు లేవని చెప్పారు. న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ఈ ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ప్రారంభించారు. ముఖ్యమంత్రులు, హైకోర్టుల న్యాయమూర్తులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ అల్తమాస్ కబీర్ మాట్లాడారు.