: రేపు లోక్ సభలో గోపీనాథ్ ముండే మృతి పట్ల సంతాప తీర్మానం: వెంకయ్య
ఎంతో భవిష్యత్తు ఉన్న గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణం తననెంతో బాధించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గోపీనాథ్ ముండే మృతి పట్ల రేపు లోక్ సభలో సంతాప తీర్మానం ఉంటుందని అన్నారు. సంతాపం తెలిపిన అనంతరం లోక్ సభ వాయిదా పడుతుందని ఆయన చెప్పారు. రేపు లోక్ సభలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు. లోక్ సభలో ఎల్లుండి సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ నెల 6వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.