: అందంగా లేదని నిప్పంటించిన భర్త... మంటలతో భర్తను కౌగిలించుకున్న భార్య
కృష్ణా జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలో దారుణం చోటు చేసుకుంది. అందంగా లేదని కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో ప్రబుద్ధుడు. ఒళ్లంతా అంటుకున్న మంటలతో ఆమె భర్తను కౌగిలించుకుంది. మంటల్లో చిక్కుకున్న వారిని విడదీసి మంటలార్పిన స్థానికులు, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.