: కోటి రూపాయల ఎర్రచందనం సీజ్... 54 మంది అరెస్ట్
ఎర్రచందనం దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నా, మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా సాగిపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. చంద్రగిరి మండలం మామండూరు అటవీ ప్రాంతంలో తనిఖీల్లో పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 54 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.