: 50 నిమిషాలు తీవ్రంగా కష్టపడ్డాం... కానీ, బతికించలేక పోయాం: ఎయిమ్స్ డాక్టర్లు
ముండే శరీరంపై ప్రమాదకరమైన గాయాలేమీ లేవని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. అయితే, ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆయన శ్వాసవ్యవస్థ పనిచేయలేదని చెప్పారు. ఆయనను బతికించడానికి దాదాపు 50 నిమిషాల పాటు విశ్వ ప్రయత్నం చేశామని... కీలక సమయంలో ఆయన గుండె పనిచేయలేదని తెలిపారు. దీంతో, ఎంత శ్రమించినా ముండేను బతికించలేక పోయామని డాక్టర్లు వెల్లడించారు.