: బర్డ్ ఫ్లూ నివారణకు కొత్త మందుకు చైనా అనుమతి
ప్రాణాంతకమైనటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా.. చైనా ప్రభుత్వం ఓ కొత్తతరహా మందు వినియోగానికి తాజాగా అనుమతి ఇచ్చింది. చైనాలో ఇటీవలి కాలంలో 18 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అందులో 6 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వైరస్ నివారణకు కొత్త మందుకు అనుమతి రావడం విశేషం. చైనా ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు పేర్కొన్న వివరాల ప్రకారం.. సోడియం క్లోరైడ్‌తో కలిపిన పెరామివిర్ ఇంజెక్షన్లు ప్రభావవంతంగా ఉంటాయని ప్రాధమిక పరీక్షల్లో తేలినట్లు చైనాలోని జిన్‌హువా వార్త సంస్థ తెలిపింది. చైనాలో ఇప్పటిదాకా షాంఘైలో 8, జియాంగ్సూలో 6, జీయాంగ్‌లో 3, అన్‌హూయి లో 1 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.