: టికెట్ అడిగినందుకు రైల్లోంచి టీసీని బయటకు నెట్టేశారు!


త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ లో జనరల్ బోగీలో ప్రయాణికుల టికెట్ల తనిఖీ జరుగుతోంది. తనిఖీ అధికారులు టికెట్లను పరిశీలిస్తుండగా ఓ ఇద్దరు ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. జరిమానా కట్టమని అడిగినందుకు ఆ అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ అధికారిని కదులుతోన్న రైల్లోంచి తోసేశారు. ఆ అధికారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా పోత్కపల్లి - దిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య జరిగిందీ ఘటన.

  • Loading...

More Telugu News