: కేసీఆర్ ప్రమాణ స్వీకారంలో తొలి వివాదం
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి తొలి వివాదం చెలరేగింది. గవర్నర్ నరసింహన్ కు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ రాసిన లేఖ వివాదాన్ని రేపింది. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహన్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందలేదని, అందుకు కారణాలు ఏంటని నిలదీస్తూ ఆనంద భాస్కర్ లేఖాస్త్రం సంధించారు.