: మోడీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా భేటీ అయ్యారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిని త్రివిధ దళాధిపతులు కలవడం సంప్రదాయం. అందులో భాగంగా నేడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా ప్రధానిని కలిశారు. సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని వేళలా భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉంటుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత వైమానిక దళ అవసరాలను ప్రధానికి ఆయన వివరించారు.