: భావోద్వేగానికి లోనైన కలెక్టర్ స్మితా సభర్వాల్
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించిన ఆమె, వారి త్యాగాలను, దిక్కులేని వారైన అమరవీరుల తల్లిదండ్రుల పరిస్థితిని తలచుకుని కంటతడిపెట్టారు. అమరవీరుల తల్లులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న సందర్భంగా ఆమె కదిలిపోయారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.