: విశాఖ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ
విశాఖ ఐటీ పరిశ్రమ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు చేపట్టాల్సిన చర్యలపై విశాఖలోని రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్, విశాఖ అభివృద్ధి మండలి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఈ ప్రణాళికను చంద్రబాబుకు అందజేయనున్నట్లు ఈ సంఘాల ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ చెప్పారు.
ప్రస్తుతం విశాఖపట్నంలోని 70 ఐటీ కంపెనీల్లో 20 వరకే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ. 5 వేల కోట్లు దాటాల్సి ఉండగా రూ. 1,450 కోట్ల వద్ద ఆగిపోయింది. అలాగే ఐటీ ఉద్యోగుల సంఖ్య 70 వేలు దాటాల్సి ఉండగా, 10,200 వద్ద నిలిచిపోయింది.