: హైదరాబాదును ఐటీ రంగంలో మేటిగా అభివృద్ధి చేస్తాం: కేటీఆర్
హైదరాబాదును ఐటీ రంగంలో మేటిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాదును పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకుపోతామని ఆయన చెప్పారు. రానున్న ఐదేళ్ళు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.