: విదేశీ విద్యార్థులకు బ్రిటన్ తాయిలాలు
విదేశాలనుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు అగ్రదేశాలు తాయిలాలు అంటే ప్రత్యేకంగా ఏమీ కల్పించక్కర్లేదు. వారి వీసాల విషయంలో కొంత పట్టువిడుపు ఉండే వెసులుబాట్లు కల్పిస్తేచాలు. ప్రస్తుతం స్టూడెంట్స్ విషయంలో బ్రిటన్ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ప్రతిభగలవారిని ఆకర్షించేందుకు బ్రిటన్ కొన్ని వలస నిబంధనలను సడలించింది. వలస సంస్కరణల నుంచి రూపొందించిన గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాంను తాజాగా అమల్లోకి తెచ్చారు. తాజాగా.. బ్రిటన్‌లో ఎంబీఏ, పీహెచ్‌డీ చేసేవారు అక్కడే ఉద్యోగం, వ్యాపారం కోసం ఓ ఏడాదిపాటు అదనంగా ఉండడానికి అనుమతించేలా నిబంధనల్ని సడలించారు.