: మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: కేసీఆర్
ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం స్నేహశీల స్వభావంతో ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రిగా తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన ఆయన ఉద్యోగులతో మాట్లాడుతూ... ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంతోనే ప్రగతి సాధ్యమని అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. గందరగోళంగా ఉన్న ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను సరళీకరిస్తామన్నారు. ఉద్యోగుల డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలే తెలంగాణ ప్రభుత్వానికి బాసులు అని కేసీఆర్ అన్నారు.