: నన్ను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకునే మగాడెవ్వడు?
తెలుగుదేశం పార్టీ నేతలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. తనను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకునే మగాడెవ్వడని నాని సవాల్ విసిరారు. అదే క్రమంలో జగన్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు గుడివాడలో జరిగిన ఓ బహిరంగ సభలో నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను డబ్బుకు అమ్ముడుబోయి వైఎస్సార్సీపీలో చేరలేదని వివరణ ఇచ్చారు. వైఎస్ ఫొటో సరసన ఎన్టీఆర్ ఫొటో పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నాని ఆరోపించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు తప్ప, ఎవరైనా ఆయన ఫొటో పెట్టుకోవచ్చని నాని విపులీకరించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే అని నాని అన్నారు.