: కాసేపట్లో కేసీఆర్ కు ఫోన్ చేయనున్న చంద్రబాబు
తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ఫోన్ చేయనున్నారు. సెక్రటేరియట్ లోని సీఎం కార్యాలయంలో ఆయన ఆసీనులయిన తర్వాత చంద్రబాబు ఫోన్ చేస్తారు. ఈ సందర్భంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు బాబు శుభాకాంక్షలు తెలుపుతారు. అంతేకాకుండా, ఈ నెల 8న తన ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ ను ఆహ్వానిస్తారు.