: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ చేత ప్రమాణం చేయించారు. జాతీయ గీతం జనగణమనతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది. రాజకీయ నేతలు, ప్రముఖుల సమక్షంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేశారు. మాతృభాష తెలుగులో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం కేసీఆర్ ను గవర్నర్ నరసింహన్ అభినందించారు.