: నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటం ఫలించింది: నాయిని


ఈ రోజుతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పోరాటం ఫలించినట్లయిందని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ ఉదయం ఆయన తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ కల సాకారమైందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అలుపెరుగకుండా కృషి చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News