: కేసీఆర్ కేబినెట్లో 11 మంది మంత్రులు
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిలో హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, జోగు రామన్న, నాయిని నర్శింహారెడ్డి, మహ్మద్ అలీ, మధుసూదనాచారి, పద్మారావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం. అయితే, జాబితాలోని వారి పేర్లు బయటపడకుండా కేసీఆర్ చాలా గోప్యతను పాటిస్తున్నారు. ఇంత వరకు అధికారికంగా ఎవరి పేర్లు వెల్లడి కాలేదు.