: కూపర్ సూపర్.. రాయల్స్ విన్నర్
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ లో ఆఖర్లో హైడ్రామా చోటు చేసుకుంది. చివర్లో ఢిల్లీ జట్టు గెలవాలంటే 6 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన తరుణంలో బంతి చేతపట్టిన యువ కెరటం కెవాన్ కూపర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను రాయల్స్ పరం చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చిన కూపర్ రెండు వికెట్లు కూడా తీశాడు. దీంతో, 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు 6 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో ఓపెనర్ వార్నర్ (77) టాప్ స్కోరర్. కాగా, డెవిల్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి.