: సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
పోలవరం ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంలో పోలీసులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు... రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా రాజయ్య దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.