: రామ మందిర నిర్మాణం ప్రభుత్వాలు చేసే పని కాదు: వెంకయ్యనాయుడు
రామ మందిర నిర్మాణం అనేది ప్రభుత్వాలు చేసే పని కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ప్రభుత్వాలు నిర్మించవని చెప్పారు. రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మందిర నిర్మాణం పేరుతో ఓట్లు కూడా అడగలేదని తెలిపారు. రామ మందిర నిర్మాణమనేది దేశ ప్రజల ఆకాంక్ష అని... దాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన సహాయం మాత్రమే ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఓ వార్తా చానల్ తో మాట్లాడుతూ, వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.