: కేరళ తీరాన్ని సమీపిస్తున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సమయానికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని పేర్కొంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వారం రోజుల సమయం పడుతుంది.