: ప్రయాణికురాలి నుంచి 2 కిలోల బంగారం పట్టివేత
దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఓ మహిళ నుంచి 2 కేజీల బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెన్యాకు చెందిన సదరు ప్రయాణికురాలు కార్బన్ పేపర్ లో దాచి బంగారం బిస్కెట్లను తీసుకురాగా తనిఖీల్లో బయటపడ్డాయి. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు.