: అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వాలంటూ పిల్... తోసిపుచ్చిన హైకోర్టు
అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిల్ పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. రాష్ట్ర విభజన సరిగా లేదని, అందువల్ల అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వాలని న్యాయవాది సంజీవరెడ్డి ఈ పిల్ ను దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారిస్తోందని... అందువల్ల స్టే ఇవ్వలేమని తెలిపింది. అంతేకాకుండా పిల్ ను తోసిపుచ్చింది.