: దావూద్ ఇబ్రహీం ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశం


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ఆస్తుల జప్తునకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై అభియోగ పత్రం దాఖలైందని, వారిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఉన్నట్టు ఢిల్లీ ప్రత్యేక విభాగ పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. వీరంతా చాలా కాలంగా దేశంలో లేరని కోర్టుకు విన్నవించారు. దీంతో వారిరువురి ఆస్తుల జప్తునకు ఆదేశించాలని కోర్టును కోరడంతో, చివరిసారిగా నమోదైన నిందితుల చిరునామా వద్ద వారి ఆస్తుల జప్తునకు సంబంధించి నోటీసులు అంటించాలని, గుర్తింపు గల పత్రికల్లో నోటీసు ప్రచురింపజేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఆగస్టు 16న తదుపరి జరిగే విచారణ నాటికి దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News