: కేసీఆర్ వల్లే ఆర్డినెన్స్ జారీ చేశారు: భట్టివిక్రమార్క


1956 నాటి తెలంగాణ కావాలని కేసీఆర్ కోరడం వల్లే తెలంగాణకు నష్టం సంభవించిందని మాజీ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరంపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ఆర్డినెన్స్ కారణంగా 450 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును, సాగునీటి సౌకర్యం ఉన్న రెండు లక్షల ఎకరాలను తెలంగాణ కోల్పోతుందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News