: శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు 31-05-2014 Sat 13:20 | తిరుమల కనుమల్లోని శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మొదటి కనుమ రహదారిలోని 57వ మలుపు వద్ద అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు టీటీడీ అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.