: దయచేసి కాళ్లకు మొక్కకండి...కాళ్లు లాగడానికి ప్రయత్నించకండి: వెంకయ్యనాయుడు
తనను కలిసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అందరికీ అభినందనలని, తాను చాలాసేపు ఇక్కడే ఉంటాను కనుక ఎవరూ తోసుకోవద్దని ఆయన సూచించారు. ఈ మధ్య అందరూ కాళ్లకు మొక్కుతున్నారని, అలా మొక్కవద్దని ఆయన సూచించారు. తాను దేవుడి తరువాత దేవుళ్లుగా భావించే వాజ్ పేయి, అద్వానీల కాళ్లకు కూడా మొక్కలేదని ఆయన తెలిపారు. అలా కాళ్లకు మొక్కే వాళ్లంతా తరువాత కాళ్లు లాగేవారేనని అన్నారు. "ఓసారి ఎన్టీఆర్ ను కలిసేందుకు నేను వెళ్లగా ఓ ఐదుగురు మహిళలు ఆయన కాళ్లకు నమస్కరిస్తున్నారు. ఇదేందన్నా? అని నేను ఎన్టీఆర్ ను అడగగా... ఆయన 'అభిమానం బ్రదర్' అన్నారు. ఆ తరువాత వారంతా నాదెండ్ల భాస్కరరావుతో కలిసి ఎన్టీఆర్ కాళ్లు లాగేశారు" అని అన్నారు.